Verse
నీకు నీవుగా నన్ను చూడగా
పరమునుండి దిగివచ్చినావయ్యా
నాపై ఇంతగా ప్రేమ చూపగ
నేనెంతటివాడను యేసయ్యా
Verse
పండుగ ఇది క్రిస్మస్ పండుగ
గుండెల నిండుగ ఆనందం పండెగా
శాపదోషమును పరిహరించగ
దీనుడై దిగివచ్చినావయ్యా
Verse
పాడైపోయిన నా స్థితి మార్చగ
శరీరాన్ని దాల్చుకున్న యేసయ్యా
నిత్యజీవమును అనుగ్రహించగ
దాసుడై దిగివచ్చినావయ్యా
Verse
తండ్రి ఇంటికి దారిని చూపగ
ప్రభావాన్ని వదులుకున్న యేసయ్యా
పాపలోకమును కనికరించగ
బాలుడై దిగివచ్చినావయ్యా
Verse
మంటివానితో స్నేహము చేయగ
స్వరూపాన్ని మార్చుకున్న యేసయ్యా