Verse
నీకు సాటి ఎవరు లేరు (యేసయ్యా)
ఇలలో నీవే ఏకైక దేవుడవు‖ 2x ‖
ఆత్మతో సత్యముతో ఆరాధింతును
నీదు క్రియలు కొనియాడెదను‖ 2x ‖
అత్యున్నతుడా నా యేసయ్యా
నీవే నాకు నిజ రక్షకుడవు‖ 2x నీకు ‖
పరమందు దూతలు నిను పొగడుచుందురు
నీవే ప్రభువుల ప్రభువని‖ 2x ‖
నీ ఘన కీర్తిని వివరించగలనా
నా ప్రియుడా నా యేసయ్యా‖ 2x అత్యున్నతుడా ‖
ఆకాశమనాడు ఆసీనుడైనవాడా
నీ తట్టు కన్నులెత్తుచున్నాను‖ 2x ‖
ఊహించువాటి కంటే అత్యధికముగా
దయచేయువాడవు నీకే స్తోత్రం‖ 2x అత్యున్నతుడా ‖