Verse
నీకున్న భారమంత ప్రభుపై నుంచు కలవర చెందకుమా
ఆయనె నిన్ను ఆధరించునూ అద్భుతములు చేయున్
Verse
నీతి మంతులను కదలనీయడు నిత్యము కాచి నడిపించును
Verse
మనలను కాచే దేవుడాయనే మనకునీడగా ఆయనే ఉండును
Verse
తల్లి తండ్రి విడచినను ఆయనే మనలను హత్తుకొనును
Verse
ప్రభువు మన పక్షమైయుండగా ఎదురు నిలువ గల వాడెవ్వడు
Verse
ప్రభుకు జీవితం సమర్పించెదం ఆయనే అంతా సఫలం చేయును
Verse
మనకున్న భారమంతా ప్రభుపై నుంచెదము కలవర చెందకుమా
ఆయనే మనలను ఆధరించును అద్భుతములు చేయును..