Chorus
నీలా ప్రేమించేవారెవరు ఇలలో లేరు
నీవే ప్రేమామయా‖ 2x ‖
Verse
నిన్ను నేను ప్రేమించకముందే
నన్ను నీవు ప్రేమించితివే
నీ మహిమనంతా విడచి
నాకొరకై దిగివచ్చితివే
Verse
నిన్ను నేను ప్రేమించకముందే
నన్ను నీవు ప్రేమించితివే
నా శిక్ష అంతా ఆ సిలువలో
నాకొరకై భరియించితివే
Verse
అంధకారములో ఆశాజ్యోతివై
చీకటి బ్రతుకును నీ వెలుగుతో నింపావు‖ 2x ‖
పరమును విడచి భువికేతించి నన్ను విమోచించావు
నీదు రాజ్య వారసునిగా నన్ను చేసుకున్నావు
ఎవరూ చేయని సాహసం నాకై సిలువలో నీవు చేసావు
వధకు తేబడిన గొర్రెపిల్లగా నాకై నీవు మారావు‖ Ninnu ‖
Verse
తల్లి మరచినా నీవు మరువవు
తండ్రి విడచినా నీవు విడువవు‖ 2x ‖
నను అనాధగా విడువనని వాగ్దానం చేసిన నాధుడవు
ఆత్మరూపిగా నాలో నివసించి నను ఆదరించావు
త్వరలో పరమునకు నన్ను కొనిపోవ
తిరిగి రానైయున్నావు
యుగయుగాలు నీతో ఉండే భాగ్యం నాకు ఇచ్చావు‖ Ninnu ‖