Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Neelaa Nenuntaanayyaa Naalo Nee Vuntenayyaa

నీలా నేనుంటానయ్యా నాలో నీ వుంటేనయ్యా

Neelaa Nenuntaanayyaa Naalo Nee Vuntenayyaa

Lyricist: Pastor J Kumar
Verse
నీలా నేనుంటానయ్యా నాలో నీ వుంటేనయ్యా
నిన్నే కలిగి నన్నే మరచిపోవాలి
నా మరణం వరకు నీతోనే నడవాలి
నీ నిత్యమహిమలో నీతో నిలచిపోవాలి
Chorus
యేసయ్యా యేసయ్యా ఇదే నాకున్న ధ్యాసయ్య
యేసయ్యా యేసయ్యా ఇదే నాచివరి ఆశయ్య
Verse
మంటినైన నన్ను నీవు మహిమగా మార్చుటకు
మహిమ కలిగిన నీవు మనిషిగా ఏతెంచావు.
వాడబారనీ నీ మహిమను నే పొందుటకు
విలువైన రక్తము నిచ్చి నీసొత్తుగా మార్చావు
శ్రమల కొలిమిలో నన్ను పుటము వేసిన
పరిశుద్ధ జీవితం నాకు దయచేసినా
నా వేదన భాదలలో ఓదార్పు నే పొందుటకు
ఎన్నో భాధలనుభవించి మాధరి చూపించావు
నిత్యమహిమలో నే వారసత్వమొందుటకు
శ్రమలనే సిలువను మోయగా నన్ను ఎన్నుకున్నావు
నీదు సారెపై నన్ను మలచినా
నీదు రూపులోనికి నన్ను మార్చివేసినా

Related Tags

WorshipDevotionalChristian