Verse
నీలాంటి ప్రేమ ఈ లోకాన
ఎవరైనా చూపారా?‖ 2x ‖
నా పాపభారం ఆ సిలువపైన
ఎవరైనా మోశారా?‖ 2x ‖
యేసయ్యా.. యేసయ్యా..
యేసయ్యా.. ఓ యేసయ్యా‖ 2x నీలాంటి ‖
Verse
చెలికాడే నిన్ను సిలువకు పంపగా
పరిసయ్యులే నిన్ను పరిహసించగా‖ 2x ‖
నోరు తెరువని ప్రేమ
బదులు పలుకని ప్రేమ‖ 2x యేసయ్యా ‖
Verse
దొంగలే నిన్ను దూషించగను
నా అనువారే అపహసించగా‖ 2x ‖
నోరు తెరువని ప్రేమ
బదులు పలుకని ప్రేమ‖ 2x యేసయ్యా ‖
Verse
తండ్రి వీరు చేయునదేమో
ఎరుగరు కనుక క్షమియించుమని‖ 2x ‖
ప్రార్ధన చేసితివయ్యా
మము క్షమియించితివయ్యా‖ 2x యేసయ్యా ‖
Verse
నీ దివ్య ప్రేమను ప్రకటింతునయ్యా
ఆ ప్రేమ మార్గములో నడిచెదనయ్యా‖ 2x ‖
నీదు ప్రేమే నా గానం
నీ ప్రేమే నా భాగ్యం‖ 2x యేసయ్యా ‖