Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Neeli Aakaashamlo

నీలి ఆకాశంలో

Neeli Aakaashamlo

Chorus
నీలి ఆకాశంలో‖ 2x ‖
నీ నీతి రాజ్యంలో
నేనుండ గోరితి ప్రభువా ఆ…
నేనుండ గొరెద ప్రభువా‖ 2x నీలి ఆకాశంలో ‖
Verse
నా ప్రియుడు నా చెంతనున్నాడు
గోప రసమంత సువాసన కలవాడు
నా ప్రియుడు ఏదేను వనమాలి
కర్పూరాల పుష్పాల సమానుడు
అతని ఎడమచేయి నా తల క్రింద నుండగా
అతని కుడిచేయి నన్ను ఆదరించుచుండగా
ప్రేమతిశయముతో నేను మూర్చిల్లెద –‖ 2x నీలి ఆకాశంలో ‖
Verse
నా ప్రియునికి తలుపు తీయ నే లేవగా
నా ప్రాణప్రియుడు నాకే ఎదురాయెను
నా ప్రియుడు ధవళవర్ణుడేతెంచగా
ఆ రత్నాల వర్ణుడు నను తాకగా
నేను నిదురించిన మనసు మేలుకొన్నది
నా మనసంతా యేసుతో నిండగా
రక్షించి నను చేర్చె ఆ ప్రేమ పురమున –‖ 2x నీలి ఆకాశంలో ‖

Related Tags

WorshipHeavenDevotion