Verse
నీళ్లలా పోయబడినాను తీగలా సాగిపోయాను
దుమ్ములా ధూళిలా ప్రాణం పోవునంతలా
తనువులోను మనసులోనూ
శత్రు మిత్రుల చేతుల్లోను
నలిగి పోయాను నేను విరిగిపోయాను‖ 2x నీళ్ళలా ‖
Verse
పోయిందని అనుకున్న ప్రాణం తిరిగి దక్కేలా
దక్కిన ప్రాణం క్రొత్త బతుకును ప్రారంభించేలా
దేవునికి మానవునికి ఉపకరించేలా
నలిగి పోయాను నేను విరిగిపోయాను‖ 2x నీళ్ళలా ‖
Verse
లోకులు చూపె ప్రేమలోని స్వార్ధం ఎరిగేలా
క్రీస్తులోని నిస్వార్ధ ప్రేమకు అర్ధం తెలిసేలా
అదృశ్యమైనవి నిత్యములంటు గ్రహింపు పొందేలా
నలిగి పోయాను నేను విరిగిపోయాను‖ 2x నీళ్ళలా ‖