Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Neelo Jeevinchaalani

నీలో జీవించాలని

Neelo Jeevinchaalani

Lyricist: K Y Ratnam
Verse
నీలో జీవించాలని
నీలోనే బ్రతకాలని‖ 2x ‖
యుగయుగాల నీతోనే ఉండాలని‖ 2x ‖
తుది శ్వాస వరకు నీలోనే నా గమ్యం‖ 2x ‖
యేసూ నువ్వే కావాలి
నా యేసూ నీతో ఉండాలి‖ 2x నీలో ‖
Verse
మిగిలింది నాకు నిత్య శోకము
ఈ నా జీవిత యాత్రలో
కన్నీళ్లే నాకు అన్న పానములై
భుజియించుచుంటిని నిత్యము ప్రభువా‖ 2x ‖
నీవు నాకు ప్రత్యక్షము అయిన వెంటనే‖ 2x ‖
నా దుఃఖ దినములన్ని సమాప్తమాయెను‖ 2x యేసు ‖
Verse
కటిక చీకటే నాకు స్నేహమాయెను
అంధకారమే నాలో నాట్యమాడెను
ఎటు వైపు చూసినా వెలుగు కాన రాలేదు
మార్గమే తెలియక మతి చెలించెను‖ 2x ‖
నీ వైపు చూడగానే వెలుగు కలిగె దేవా‖ 2x ‖
నీ నామమే నాకు మార్గమాయెను‖ 2x యేసు ‖

Related Tags

WorshipComfortDevotion