Verse
నీలో సమస్తము సాధ్యమే‖ 2x ‖
మహొన్నతుడా యేసయ్యా
బలవంతుడా యేసయ్యా‖ 2x ‖
ఆరాధింతును – నిన్నే స్తుతియింతున్‖ 4x నీలో ‖
Verse
అలసియున్న నా ప్రాణమును సేదదీర్చువాడవు
జీవజలపు ఊటనిచ్చి తృప్తిపరచువాడవు‖ 2x ‖
ప్రార్థనలన్ని ఆలకించువాడవు నీవు
అడిగినవన్ని ఇచ్చేవాడవు నీవు‖ 2x మహొన్నతుడా ‖
Verse
శోధన వేదనలలో జయమిచ్చువాడవు
బుద్దియు జ్ఞానమిచ్చి నడిపించువాడవు‖ 2x ‖
నిత్యజీవం ఇచ్చేవాడవు నీవు
మాతో ఉన్న ఇమ్మానుయేలువు నీవు‖ 2x మహొన్నతుడా ‖