Verse 1
నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం
నిన్న నేడు నిరంతరం మారని దేవా‖ 2x ‖
Chorus
ఈ లోకమంతా నేను వెతదకినా నాకు లేదయ్యా ఎక్కడా ఆనందం
నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపిన నా హృదయం పొంగెను‖ 2x ‖
Verse
ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను ఏది నా సొంతం కాదు అనుకున్నాను‖ 2x ‖
తప్పిపోయిన కుమారుని నేనయితే నా కొరకే నిరీక్షించే తండ్రి నా యేసు‖ 2x ‖
Verse
ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్య ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా‖ 2x ‖
నన్ను మరువని ప్రేమ నీ దయ్యా నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్‖ 2x ‖