Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Neelone Labhinchindi Jeevam

నీలోనే లభించింది జీవం

Neelone Labhinchindi Jeevam

Lyricist: A R Stevenson
Verse
నీలోనే లభించింది జీవం
నీతోనే వరించింది స్నేహం
నాకే ఏల ఈ గొప్ప సౌభాగ్యం
నాకై పెట్టితివి ప్రాణం
నను ఆకర్షించెను నీ త్యాగం
నీవే నే చేరాల్సిన గమ్యం
ప్రాణానికి ప్రాణం
Pre-Chorus
యేసయ్యా నీకంకితం
నీ మహిమార్థం ఇచ్చిన జీవితం
నాకేరూపు లేనప్పుడు
నను నీవే చూసియున్నావుగా
ఊహే నాకు రానప్పుడు
నీవు నన్నే కోరుకున్నావుగా
నీకే స్తుతిగీతం
నీకోసం సంగీతం
ప్రేమించావు అమితంబుగా
నను నీ రాజ్యాన సమకూర్చగా
హెచ్చించావు అధికంబుగా
ఘన సంకల్పాన్ని నెరవేర్చగా
నీవే నా శరణం
నీతోనే నా విజయం
నైపుణ్యాన్ని నేర్పించుచు
సరిచేస్తున్నావు క్రమక్రమముగా
సామర్ధ్యాన్ని అందించుచు
బలమిస్తున్నావు స్థిరపరచగా
నీతో సహవాసం
అభివృద్ధికి సోపానం

Related Tags

WorshipGraceSalvation