Verse
నీపై వెలుగు విరజిల్లే సంవత్సరం
నీతి సూర్యుడుదయించె హితవత్సరం
నీ దుఃఖ దినములు సమాప్తమాయెను
నీ నిందకు రెట్టింపు ఘనత వచ్చును
Verse
నీ సరిహద్దులలో సమాధానము
మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచును
నీ చేతి పనులను దీవించును
రెండింతల మేలు నికనుగ్రహించును
నిత్యమైన కృపను నీకు చూపును
ఏ కీడు రాకుండ కాపాడును
నీ దుఃఖ దినములు సమాప్తమాయెను
నీ నిందకు రెట్టింపు ఘనత వచ్చును
Verse
శాశ్వత ప్రేమతో ప్రేమించును
నీరు కట్టిన తోట వలె చిగురించుదువు
నీ గాయములను మాన్పివేయును
ఆరోగ్యము నీకు కలుగజేయును
అభివృద్ధి పరచి ఫలింపజేయును
మంచి పేరు ఖ్యాతిని దయచేయును
నీ దుఃఖ దినములు సమాప్తమాయెను
నీ నిందకు రెట్టింపు ఘనత వచ్చును
Verse
తొలకరి వర్షమును కురిపించును
కడవరి ఉజ్జీవము ప్రవహింపజేయును
ఉత్సాహ సంతోషం కలుగజేయును
కృపయు క్షేమములు నీ వెంట వచ్చును
నీ గిన్నె నిండి పొర్లి పారును
దయకిరీటమును ధరింపజేయును
నీ దుఃఖ దినములు సమాప్తమాయెను
నీ నిందకు రెట్టింపు ఘనత వచ్చును