Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Neethi Nayamulu Jariginchu Naa Yesaiah

నీతి న్యాయములు జరిగించు నా యేసయ్యా

Neethi Nayamulu Jariginchu Naa Yesaiah

Lyricist: Bro Yesanna
Chorus
నీతి న్యాయములు - జరిగించు నా యేసయ్యా
నిత్య జీవార్దమైనవి నీ శాసనములు
వృద్ధి చేసితివి పరిశుద్ధ జనముగ నీ ప్రియమైన స్వాస్థ్యమును
రద్దు చేసితివి ప్రతివాది తంత్రములను నీ రాజదండముతో
Verse
ప్రతి వాగ్దానము నా కొరకేనని
ప్రతి స్థలమందు నా తోడై కాపాడుచున్నావు నీవు
నిత్యమైన కృపతో నను బలపరచి
ఘనతను దీర్ఘాయువును దయచేయువాడవు‖ నీతి ‖
Verse
పరిమళ వాసనగ నేనుండుటకు
పరిశుద్ధ తైలముతో నన్నభిషేకించియున్నావు నీవు
ప్రగతి పధములో నను నడిపించి
ప్రఖ్యాతిని మంచి పేరును కలిగించువాడవు‖ నీతి ‖
Verse
నిత్య సియోనులో నీతో నిలుచుటకు
నిత్య నిబంధనను నాతో స్థిరపరచుచున్నావు నీవు
మహిమగలిగిన పాత్రగ ఉండుటకు
ప్రజ్ఞ వివేకములతో నను నింపువాడవు‖ నీతి ‖

Related Tags

WorshipHolinessGrace