Verse
నీతి సూర్యుడవై వెలుగుతున్న యేసయ్య
నీ ఏర్పాటులోన నీ దేహము మేమయ్య‖ 2x ‖
నీదు రక్షణతో మమ్ము కాచినందుకు
నీదు సంఘముగా మమ్ము నిలిపినందుకు‖ 2x ‖
నీకే వందనం – నీకే వందనం
నీకే వందనం – యేసు రాజ వందనం‖ 2x నీతి ‖
Verse
త్వరలో రానై ఉన్నావయ్యా మా ప్రభువా
నీదు విందులోన చేరాలని మా దేవా‖ 2x ‖
సిద్ధపాటుకై కృపలను చూపుమని
నిన్నే వేడితిమి నీవే మా బలమని‖ 2x నీకే ‖
Verse
నీ నామము రుచిని ఎరిగిన వారము మేము
నిరతము నీ మంచి మన్నాతో బ్రతికెదము‖ 2x ‖
నీ ఆశ్రయములో కురిసెను దీవెనలు
నీలో నిలిచెదము చాటగా నీ తేజము‖ 2x నీకే ‖