Verse
నీతి సూర్యుడు నీపై నుదయించును
అతని రెక్కలు నారోగ్యము నిచ్చును
Verse
పాపపు టంధకార మందుంటిమి
శాప శిక్షపొంద తగియుంటిమి
దాపున జేరిన నీతి సూర్యుడు
నీపై ప్రకాశించు నిత్యము
Verse
కృపయు సత్యము యేసు ద్వార కల్గెన్
కృపనుబొందగ వేగమే రారమ్ము
అపరిమిత కృపనుండి నీవు
కృపవెంబడి కృప బొందెదవు
Verse
వారాయన తట్టు తేరిచూడగా
వారి ముఖము బహు ప్రకాశించెను
పరమ ప్రభును చూడు నీతి సూర్యుని
కిరణంబులు వెల్గునిచ్చును
Verse
మందిరమంత యెహోవా తేజస్సు
అందరు చూడ నిండి యుండెను
సుందరమగు క్రీస్తు తేజస్సును
పొంది యారాధించి స్తుతించు
Verse
తన మహిమకు రాజ్యమునకును
మనలను పిలిచిన దేవునికి
వినయముతోడ విధేయులమై
నడుచుకొందుము నిత్యము