Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Neethi Sooryumdu Udhayimchu Nippudu Athani Kiranamulu Aaroagyamichchunu

నీతి సూర్యుండు ఉదయించు నిప్పుడు అతని కిరణములు ఆరోగ్యమిచ్చును

Neethi Sooryumdu Udhayimchu Nippudu Athani Kiranamulu Aaroagyamichchunu

Verse
నీతి సూర్యుండు ఉదయించు నిప్పుడు
అతని కిరణములు ఆరోగ్యమిచ్చును
రెక్కలతోనే కప్పును మనలన్
Verse
కొలిమి కాలునట్లు కాల్చెడి దినము
తిలకించుము అది వచ్చుచున్నది
ఇల గర్విష్టులు దుష్టులెల్లరు
పాలుపొందెదరు అగ్నిగుండమున
Verse
సైన్యములధిపతి సెలవిచ్చెను
ఖాయముచూడు నాశనదినము
భయంకరమైనది తీర్పుదినము
చేయును నాశము రూపులేకుండ
Verse
దేవునికి మీరు భయపడినచో
పశ్చాతాపమొందు, పశ్చాతాపమొందు
జీవము నొసగును సమృద్ధిగా
కరమునిచ్చి మిమ్ముకాపాడును
Verse
ప్రభు నియమించిన ఆ దినమురాగ
ప్రభు ప్రజలందరు తన సొత్తగుదురు
ప్రభు కరుణించును పుత్రులుగా
అధికారమిచ్చును స్వాస్థ్యము నొసగి
Verse
క్రీస్తుని ప్రేమ అమూల్యమైనదియు
నిత్యము నిల్చెడి ఆత్మీయమైనది
దుష్టులకొరకై ప్రాణమిడె
క్షమాపణ నొసగి విమోచించుతానే
Verse
ప్రభు ప్రజలారా శత్రుని తలను
విభుని సాయమున అణగద్రొక్కెదరు
శత్రువులందరు దూళి అగుదురు
విజయానందము మీరు పొందెదరు
Verse
మరువకుడి ప్రభు మాటలెన్నడు
స్థిరముగనుండి సిద్ధపడుడి
త్వరగా మహిమతో ప్రభు వచ్చున్
పరమున మిమ్ము తనతోనుంచును

Related Tags

Second ComingHealingSalvationJudgment