Verse 1
నీతి సూర్య తేజోమయుడా
ధవళవర్ణుడా రత్నవర్ణుడా
పదివేలలో అతి శ్రేష్ఠుడా
శుద్ధుడా మహిమాన్వితుడా
Chorus
మనసు మార్చు పరమ తండ్రి
నీదు ఆత్మతో నేను నిండా
మనసు మార్చు పరమ తండ్రి
నీదు రూపులో నేను మారా
నీదు మహిమతో నేను నిండా
Verse
పనికిరాని పాత్రను నేను
పడిపోయిన పామరుండన్
మంచిలేని పాపిని నేను
చీకటి నిండిన అపవిత్రుడను
Verse
నీదు సన్నిధిన్ నేను వదలి
నీదు స్మరణను నేను మాని
మలినం నిండి మార్గము తప్పి
చెదరివున్న దోషాత్ముడను
Verse
సౌఖ్యము కోరి క్షేమము మరచి
దైవ ఆజ్ఞన్ నేను విడిచి
కానరాని దూరం పోయి
ఒంటరినైనా అనాధుడను