Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Neethigala Yehova Sthuthi Meeyathmatho

నీతిగల యెహోవా స్తుతి మీయాత్మతో

Neethigala Yehova Sthuthi Meeyathmatho

Lyricist: Pasupuleti David
Chorus
నీతిగల యెహోవా స్తుతి మీయాత్మతో నర్పించుఁడి మీయాత్మతో
నర్పించుడి దాతయౌ మన క్రీస్తు నీతిని దాల్చుకొని సేవించుఁడి‖ నీతి ‖
Verse
చదలఁ బుడమియు రవియు జలధియు నదులు గిరులును జక్కఁగా
సదమలంబగు దైవనామము సర్వదా నుతిఁజేయను‖ నీతి ‖
Verse
సర్వశక్తుని కార్యముల కీ సర్వరాష్ట్ర్రము లన్నియు గర్వములు విడి
తలలు వంచుచు నుర్విలో నుతిఁజేయను‖ నీతి ‖
Verse
గీత తాండవ వాద్యములచేఁ బ్రీతి పరచెడు సేవతో పాతకంబులు
పరిహరించెడు దాతనే సేవించుఁడి‖ నీతి ‖
Verse
పరమదూతలు నరులు పుడమిని మొరలుబెట్టుచు దేవుని పరము
నందున్నట్టి యేసుని పాదములు సేవింతురు‖ నీతి ‖
Verse
ఇలను భక్తుల గూడుకొనియా బలము గల్గిన దేవుని వెలయు స్తుతి
వే నోళ్లతోడను విసుగు జెందక జేయుడి‖ నీతి ‖
Verse
ఆత్మ నీవిఁక మేలుకొని శుద్ధాత్మఁ యేసునిఁ దండ్రిని త్రిత్వమగునా
యేక దేవుని హర్షమున సేవింపవే‖ నీతి ‖

Related Tags

PraiseWorship