Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Neethimanthula Prarthana Devudalakinchunu

నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును

Neethimanthula Prarthana Devudalakinchunu

Chorus
నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును
వారు తమాల వృక్షమువలె మొవ్వు వేయుదురు‖ 2x ‖
Verse
మొరపెట్టుము గ్రాహ్యము కాని గొప్ప సంగతులు
మరియు గూఢమైన సంగతుల దేవుడే తెలుపున్
Verse
గతకాలమున క్రీస్తు పేరట అడుగకుంటిరి
సతతము ఆనంద మొంద అడుగుడి దొరుకున్
Verse
యెహోవాకొరకు ఎదురుచూచి పొందుడి బలము
ఇహమునందు పక్షిరాజువలె పై కెగురుదురు
Verse
ఊహించలేనిది శక్యము గానివైనట్టి క్రియలను
యెహోవా చేయ శక్తిమంతుడు అత్యధికముగా
Verse
మిమ్ము విడువనెన్నడు నెడబాయననెగదా
నమ్ముము నరమాత్రుం డెపుడే హానిచేయడు
Verse
ఆ ప్రభు తన ఐశ్వర్యమందు క్రీస్తు యేసులో
మీ ప్రతి యవసరము తీర్చి కాచు నిరతమున్
Verse
నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును
నిశ్చయముగా వృద్ధిపొందింతుననె నీ దేవుడు

Related Tags

PrayerBlessingRighteousness