Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Neetho Gadipe Prathi Kshanamu

నీతో గడిపే ప్రతి క్షణము

Neetho Gadipe Prathi Kshanamu

Verse
నీతో గడిపే ప్రతి క్షణము
ఆనంద బాష్పాలు ఆగవయ్యా‖ 2x ‖
కృప తలంచగా మేళ్లు యోచించగా‖ 2x ‖
నా గలమాగదు స్తుతించక – నిను కీర్తించక
యేసయ్యా యేసయ్యా – నా యేసయ్యా‖ 4x నీతో ‖
Verse
మారా వంటి నా జీవితాన్ని
మధురముగా మార్చి ఘనపరచినావు‖ 2x ‖
నా ప్రేమ చేత కాదు
నీవే నను ప్రేమించి‖ 2x ‖
రక్తాన్ని చిందించి
నన్ను రక్షించావు‖ 2x యేసయ్యా ‖
Verse
గమ్యమే లేని ఓ బాటసారిని
నీతో ఉన్నాను భయము లేదన్నావు‖ 2x ‖
నా శక్తి చేత కాదు
నీ ఆత్మ ద్వారానే‖ 2x ‖
వాగ్ధానము నెరవేర్చి
వారసుని చేసావు‖ 2x యేసయ్యా ‖

Related Tags

PraiseWorshipGrace