Chorus
నీతో సమమెవరు? నీలా ప్రేమించేదెవరు ?
నీలా క్షమియించెదెవరు ? యేసయ్యా
నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరూ?‖ 2x ‖
Verse
వెండి బంగారము ధన ధాన్యాలను ఒక్కపోగేసిన నీతో సరితూగునా‖ 2x ‖
జీవనదులన్నియూ సర్వసముద్రములు ఒక్కటై ఎగసిన నిన్ను తాకగలవా
నీలా జాలిగల ప్రేమగల దేవుడేరి నీవేగా మంచి దేవుడవు‖ 2x ‖
Verse
పలు వేధాలలోమత గ్రందాలలో పావనేసుకన్న పరిశుద్ధుడెవరు‖ 2x ‖
పాప పరిహారము సిలువ మరణమొంది తిరిగి లేచినట్టి దైవ నరుడెవ్వరు
నీలా పరిశుద్ద దేవుడెవరున్నారయ్యా నీవేగా విమోచకుడవు‖ 2x ‖
Verse
నేను వెదకాకున్నా నాకు దొరికితివి నే ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి‖ 2x ‖
నీకు గాయాలుచేసి తరచు రేపితిని నన్నెంతో సహించి క్షమియించితివి
లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించినా నీవేగా చాలిన దేవుడవు‖ 2x ‖