Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Neetho Sneham Cheyalani

నీతో స్నేహం చేయాలని

Neetho Sneham Cheyalani

Verse
నీతో స్నేహం చేయాలని
నీ సహవాసం కావాలని‖ 2x ‖
నీ లాగే నేను ఉండాలని
నిను పోలి ఇలలో నడవాలని‖ 2x ‖
యేసయ్యా… యేసయ్యా…
నీ స్నేహం నాకు కావాలయ్యా‖ 2x నీతో ‖
Verse
శాశ్వతమైన నీ కృపతో నింపి
నీ రక్షణ నాకు ఇచ్చావయ్యా‖ 2x ‖
ఏమివ్వగలను నీ కృపకు నేను
నన్ను నీకు అర్పింతును‖ 2x ‖
యేసయ్యా… యేసయ్యా…
నీ కృపయే నాకు చాలునయ్యా‖ 2x ‖
Verse
మధురమైన నీ ప్రేమతో నన్ను పిలచి
నీ సేవకై నన్ను ఏర్పరచుకున్నావా‖ 2x ‖
ఏమివ్వగలను నీ ప్రేమకు యేసు
నన్ను నీకు అర్పింతును‖ 2x ‖
యేసయ్యా… యేసయ్యా…
నీ ప్రేమే నాకు చాలునయ్యా‖ 2x ‖
Verse
బలమైన నీ ఆత్మతో నన్ను నింపి
నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా‖ 2x ‖
ఏమివ్వగలను నీ కొరకు నేను
నన్ను నీకు అర్పింతును‖ 2x ‖
యేసయ్యా… యేసయ్యా…
నీ తోడే నాకు చాలునయ్యా‖ 2x నీతో ‖

Related Tags

GraceSurrenderDevotionFriendship