Verse
నీతోడు ఉంటే చాలు మాకెంతో మేలు
నీ నీడ ఉంటే చాలు ఎకొదువ మాకు లేదు‖ 2x ‖
కలతలన్ని తీర్చి కలసి మాతో నడచి
మారని ప్రేమచూపిన మంచి యేసయ్యా‖ 2x ‖
Chorus
చాలునయా నీ కృప ప్రతి దినము పోషించుచున్నదయా
చాలునయా నీ కృప ప్రతి క్షణము ఆదరించుచున్నదయా‖ 2x ‖
Verse
మా కష్టకాలములో నీదయను మాపై చూపి
బీడులాంటి మా బ్రతుకులను నీటి ఊటగా మార్చావయా‖ 2x ‖
ఆపదలన్నీ మము చుట్టూముట్టిన ఆప్తులందరు దూరమైన
అనురాగాలు మాపై కురిపించి నీ మధుర ప్రేమను చూపావయా‖ 2x ‖
Chorus
చాలునయా నీ కృప ప్రతి దినము పోషించుచున్నదయా
చాలునయా నీ కృప ప్రతి క్షణము ఆదరించుచున్నదయా‖ 2x ‖
Verse
మా హృదయ వేదనలో నీ జాలి మాపై చూపి
కన్నీటి దుఃఖమును నాట్యముగా మార్చావయా‖ 2x ‖
గాయాలెన్నో కలవరపరచిన కారుమబ్బులే కమ్ముకొన్నాను
అనుబంధాలే మాపై చూపించి నీ ప్రేమ కౌగిలిలో దాచవయా‖ 2x ‖
Chorus
చాలునయా నీ కృప ప్రతి దినము పోషించుచున్నదయా
చాలునయా నీ కృప ప్రతి క్షణము ఆదరించుచున్నదయా‖ 2x ‖