Chorus
నీతోనే నా జీవితం
ప్రతి దినము అనుక్షణము‖ 2x యేసు ‖
శోధన శ్రమలెన్ని వచ్చినా
వ్యాధి బాధలే నన్ను చుట్టినా‖ 2x యేసు ‖
Verse
శత్రువే నన్ను తరిమినా
శరీరమే క్షీణించి పోయినా‖ 2x ‖
లోకమే నన్ను విడచినా
ఇలలో సర్వం పోయినా‖ 2x యేసు ‖
Verse
కష్టాల చేత కన్నీళ్ళే వచ్చినా
ఆదరించు వారెవరూ లేకున్నా‖ 2x ‖
ఆకలితో అలమటిస్తున్నా
ఆశ్రయమే ఇలలో లేకున్నా‖ 2x యేసు ‖