Chorus
నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడునట్లు
దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడు చున్నది
Verse
జీవముగల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది
దేవుని సన్నిధికి నే నెప్పుడు వచ్చెదను
Verse
నీ దైవమేమాయెనని నిత్యము నాతో ననగా
రాత్రింబగల్లు కన్నీరే నా అన్న పానములాయె
Verse
ఉత్సాహ స్తుతులతో సమాజమును పండుగకు
దేవుని మందిరమునకు నడిపించితిని
Verse
ఇది తలంచగా నా ప్రాణము కరుగుచున్నది
నాదు ప్రాణమా యేల కృంగి తొందర పడుచున్నావు?
Verse
రక్షకుడగు దేవునిపైన నిరీక్షణ యుంచుము
ఆయన రక్షకుడని నేనింక స్తుతించెదను