Verse
పల్లవి: నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు
నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది‖ 2x ‖
నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్త్తుతియించుమా
నా యేసు చేసిన మేళ్లను నీవు మరువకుమా‖ 2x ‖
Verse
పనికిరాని నను నీవు పైకి లేపితివి
క్రీస్తనే బండపైన నన్ను నిలిపితివి‖ 2x ‖
నా అడుగులు స్థిర పరచి బలము నిచ్చితివి
నీదు అడుగు జాడలనే వెంబడింతు ప్రభు
ఇలలో వెంబడింతు ప్రభూ
…నా ప్రాణమా…
Verse
ఆంధకారపు లోయలలో నేను నడిచినను
ఏ అపాయము రాకుండ నన్ను నడిపితివి‖ 2x ‖
కంటిపాపగ నీవని నిన్ను కొలిచితివి
కన్న తండ్రివి నీవని నిన్ను కొలిచెదను
ఇలలో నిన్ను కొలిచెదను
…నా ప్రాణమా…