Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Neeti Vaagula Koraku Duppi Aashinchunatlu

నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు

Neeti Vaagula Koraku Duppi Aashinchunatlu

Verse
నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు
నీ కొరకు నాప్రాణము దప్పిగొనుచున్నది
నా ప్రాణమా నా సమస్తమాప్రభుని స్తుతియించుమా
నా యేసు చేసిన మేళ్ళను నీవు మరువకుమా
Verse
పనికిరాని నన్ను నీవు పైకిలేపితివి
క్రీస్తనే బండపైన నన్నునిలిపితివి‖ 2x ‖
నా అడుగులు స్థిరపరచి బలము నిచ్చితివి
నీదు అడుగు జాడలనే వెంబడింతు ప్రభు
నే వెంబడింతు ప్రభు
Verse
అంధకారపు లోయలలో నేను నడచితిని
ఏ అపాయము రాకుండా నన్ను నడిపితివి‖ 2x ‖
కంటి పాపగ నీవు నన్ను కాచితివి
కన్న తండ్రివి నీవని నిన్ను కొలిచెదను
ఇలలో నిన్ను కొలిచెదను
Verse
నీదు ఆత్మతో నిండుగా నన్ను నింపు ప్రభు
ఆత్మ ఫలములు దండిగా నీకై ఫలియింతును‖ 2x ‖
నీవు చేసిన మేళ్ళను నేనెట్లు మరతు ప్రభు
నీ కొరకు నే సాక్షిగ ఇలలో జీవింతును
నే ఇలలో జీవింతును

Related Tags

PraiseWorshipDevotional