Verse
నీటి యూట యొద్ద నాట బడితిమి - వేరుతన్ని ఎదిగి ఫలియింతుము
చింత పడము మాకాపుమానము - యేసు కృప చాలును‖ నీటి ‖
Verse
పాపం పోయెను హల్లెలూయ - యేసు లేచెను హల్లెలూయ
యేసు వచ్చెను హల్లెలూయ - స్తుతి గీతం పాడుదము‖ నీటి ‖
Verse
యేసే మార్గము హల్లెలూయ - యేసే సత్యము హల్లెలూయ
యేసే జీవము హల్లెలూయ - యేసు వార్తను చాటుదము‖ నీటి ‖
Verse
వాక్య ధ్యానము హల్లెలూయ - ప్రార్థనాత్మతో హల్లెలూయ
ఏకత్వముతో హల్లెలూయ - సహవాసం కోరుదమా‖ నీటి ‖