Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Neevayani Nammaka Yesunaaku Neevayani

నీవేయని నమ్మక యేసునాకు నీవేయని

Neevayani Nammaka Yesunaaku Neevayani

Lyricist: Mungamuri Devadasu
Chorus
నీవేయని నమ్మక యేసునాకు నీవేయని నమ్మిక నీవే మార్గంబు
నీవే సత్యంబు నీవే జీవంబు నీవే సర్వంబు‖ నీవే ‖
Verse
పెడదారిని బోవగ నామీదికి ఇడుమలెన్నియొరాగ అడవిలోబడి
నేను ఆడలుచు నుండగ తడవకుండ దొరుకు ధన్యుమౌ మార్గంబు‖ నీవే ‖
Verse
కారుమేఘముపట్టగ నా మనస్సులో కటిక చీకటిపుట్టగ
ఘోరాపదలుచేరి దారియని భ్రమపడగ తేరిచూడగల్గు తేజోమయ మార్గంబు‖ నీవే ‖
Verse
లేనిపోని మార్గంబు లెన్నోయుండ జ్ఞానోపదేశంబు మానుగజేయుచు
వానినిఖండించి నేనే మార్గంబన్న నిజమైన మార్గంబు‖ నీవే ‖
Verse
నరలోకమునుండి పరలోకంబు వరకు నిచ్చెనగా నుండి నరులకు
ముందుగా నడుచుచు ముక్తికి సరిగా కొనిపోవు సు స్థిరమైన మార్గంబు‖ నీవే ‖

Related Tags

JesusLifeTruth