Intro
పాపిగ నను చూడలేక
పాపముగా మారినావా
దోషిగ నను చూడలేక
నా శిక్ష నీవు పొందినావా
Pre-Chorus
నా తల యెత్తుటకు
నీవు తల వంచితివే
అర్హత నాకిచ్చుటకు
అవమాన మొందితివే
Pre-Chorus
తండ్రితో నన్ను చేర్చుటకు
విడనాడబడితివే
జీవము నాకిచ్చుటకు
మరణము నొందితివే
Chorus
నీవే నీవే నీవే దేవా
నీవే నీవే నీవే నా యేసయ్య
Verse
పరమును వీడి ఈ భువికి
దిగి వచ్చిన రక్షకుడా
మహిమను వీడి నా వెలని
చెల్లించిన ప్రేమామయుడా
Verse
నే వెదకి రాలేననె సత్యమునెరిగి
నీవే నా దరికి పరుగెత్తితివి
దాసత్వము నుండి నను విడిపించి
తండ్రి అని పిలిచే భాగ్యము నిచ్చితివి
Chorus
నీవే నీవే నీవే దేవా
నీవే నీవే నీవే నా యేసయ్య
Verse
నా స్థానములో నీవే నిలచి
నీ స్థానమే నాకిచ్చితివి
సౌందర్య వంతునిగా నన్నే చెసి
సొగసంతా కోల్పోయితివి
Verse
నీ బలమంతా నాకే ఇచ్చి
బలియాగము గా నీవే మారితివి
ఐశ్వర్య వంతునిగా నన్నే చేసి
దీనతనే హత్తుకొంటివి
Chorus
నీవే నీవే నీవే దేవా
నీవే నీవే నీవే నా యేసయ్య
Bridge
నా బలమంతా నీవే
నా సౌందర్యము నీవే
నా ఐశ్వర్యము నీవే
నీవే నీవే
నా అతిశయము నీవే
నా ఆనందం నీవే
నా ఆధారం నీవే
నీవే నీవే