Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Neeve Hrudaya Saaradhi Pragathiki Vaaradhi

నీవే హృదయ సారధి ప్రగతికి వారధి

Neeve Hrudaya Saaradhi Pragathiki Vaaradhi

Lyricist: John Wesley
Verse
నీవే హృదయ సారధి ప్రగతికి వారధి
నీ స్నేహమే సౌభాగ్యము సంక్షేమ సంతకం
నా పాటకే సౌందర్యము నీవే యేసయ్యా
మదిలో చేదు జ్ఞాపకాల విలయ వేదిక కూల్చి
చిగురాశల దిశగా నను పయనింపజేసినా
నీ మాటలు స్థిరపరచెను విశ్వాస ప్రేమలో
కలనైనా అనుకోని అనురాగ బంధమైతివే
నీవు లేని జీవితం ప్రళయసాగరమే
దిక్కు తోచని సమయములో నీవే దిక్సూచివై
చుక్కానిగ నడిపించుము ఆత్మీయ యాత్రలో
కనుపాపగ నను కాచిన నా మంచి కాపరి
చేరనైతి కోరనైతి స్నేహ సౌధము
చిరుదివ్వెగ దరిచేరి చేర్చావు సన్నిధి
చావైనా బ్రతుకైనా నీ కోసమే ప్రభు
చాటింతును నీ ప్రేమను ప్రణుతింతు ప్రేమ సాగరా

Related Tags

PraiseWorship