Verse 1
నీవే నా ఆకర్షణ నీవే నా నిరీక్షణ నీవే నా భాగం యేసయ్య
నీవే నా సంరక్షణ నీవే నా అదరణ నీవే సమస్తం యేసయ్యా
నీవే నీవే యేసు నీవే విడిపోని ప్రేమయు నీవే
నీవే నీవే యేసు నీవే మారిపోని స్నేహము నీవే
Verse
శ్రమలలో నే పడినను బాధలలో మునిగినా
నిందలెన్నో కలిగిన ఊబిలోన చిక్కుకున్న
అదరణే కరువైన ఆశ్రయమే లేకున్న‖ 2x ‖
Verse
వ్యాధులు నను చుట్టిన మరణమే వెంటాడిన
వేదనులె పడినను అవమానమే ఎదురైనా
సాతాను శోధించిన అగాధమే ఎదురైన‖ 2x ‖