Verse
నీవే నా దేవుడవు - ఆరాధింతను
నీవే నా రాజువు - కీర్తించెదను‖ 2x ‖
మరణమును జయించిన - మృత్యుంజయుడవు నీవే
మరణమునుంచి జీవముకు - నను దాటించావు
పరలోకమునుండి వెలుగుగ వచ్చి - మార్గము చూపితివి
చీకటి నుంచి వెలుగునకు - నను నడిపించావు
హోసన్నా మహిమ నీకే - హోసన్నా ప్రభావము రాజునకే‖ 2x ‖
నీవె.. నీవె.. నీవె.. నీవే‖ 2x ‖