Chorus
నీవే నా ప్రియుఁడవు యేసు ప్రభు నీవే నా యొడయుఁడవు నీవే
యనాది దేవ పుత్రుండవు నీవే లోక మెల్ల నేర్పుగఁ జేసితివి‖ నీవే ‖
Verse
పరమందు నీకుండు పరమభాగ్యంబులు నరకాయత్తుఁడ నైన నా
కొరకు విడిచితివి‖ నీవే ‖
Verse
నీవే ననుఁ బ్రోవ నెనరు నేతెంచి నీవొలుక బోసితివి నీ నల్ల
సిలువపై‖ నీవే ‖
Verse
నేనెవరిఁ బ్రేమింతు నీ కంటె లోకమున నే నెపుడు మరువను నీ
ప్రేమ నాకర్త‖ నీవే ‖
Verse
నీ సేవ నేఁ గోరి నిన్నే ప్రతిపరతు నీ సేవకుఁడ నైన నే నెట్లు నిను
విడుతు‖ నీవే ‖
Verse
సకలంబు నేలెడి చక్కని రాజవు సకలాధికారంబు చక్కఁగం చేయుదువు‖ నీవే ‖
Verse
నీ సేవకుల నెల్ల నేర్పుగా నేలెదవు నీ సేవకులు పొంద నిత్య సహాయంబు‖ నీవే ‖