Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Neeve Naa Rakshana

నీవే నా రక్షణ

Neeve Naa Rakshana

Lyricist: P Satish Kumar
Verse
నీవే నా రక్షణ – నీవే నిరీక్షణ
నీవే నా దీవెన – నీవే క్షమాపణ‖ 2x ‖
యేసయ్యా యేసయ్యా ఎంత మంచివాడవయ్యా
యేసయ్యా యేసయ్యా ఎంత మంచి మనసయ్యా‖ 2x నీవే నా ‖
Verse
గతమును మన్నించి గుణవంతునిగా చేసి
నన్ను మలచి నన్నే మరిపించి‖ 2x ‖
మనిషిగా మార్చినావు
నీ మనసు నాకిచ్చినావు‖ 2x యేసయ్యా ‖
Verse
కన్నీరు తుడచి కష్టాలు తీర్చి
అండగ నిలిచి అడ్డులన్ని తొలగించి‖ 2x ‖
మనిషిగా మార్చినావు
మాదిరిగ చేసినావు‖ 2x యేసయ్యా ‖

Related Tags

PraiseWorshipHope