Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Neeve Naa Santhoshagaanamu

నీవే నా సంతోషగానము

Neeve Naa Santhoshagaanamu

Lyricist: Hosanna Ministries
Chorus
నీవే నా సంతోషగానము
రక్షణశృంగము మహాశైలము‖ 2x ‖
బలశూరుడా యేసయ్యా నా తోడై
ఉన్నత స్ధలములపై నడిపించుచున్నావు‖ 2x నీవే నా ‖
Verse 2
ఓ లార్డ్! యు బి ద సేవియర్
షో మి సం మెర్సీ
బ్లెస్స్ మి విత్ యువర్ గ్రేస్
సేవియర్! ఫిల్ మి విత్ యువర్ లవ్
ఐ విల్ సరెండర్
యు ఆర్ మై కింగ్ గ్లోరి టు ద జీసస్
Verse
త్యాగము ఎరుగని స్నేహమందు
క్షేమము కరువై యుండగా
నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి
నీ ప్రేమతో నన్నాకర్షించినావు‖ 2x ‖
నిరంతరం నిలుచును నాపై నీ కనికరం
శోధనలైనా బాధలైననూ ఎదురింతు నీ ప్రేమతో‖ 2x నీవే నా ‖
Verse
వేదన కలిగిన దేశమందు
వేకువ వెలుగై నిలిచినావు
విడువక తోడై అభివృద్ధిపరచి
ఐగుప్తులో సింహాసనమిచ్చినావు‖ 2x ‖
మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనం
అనుదినం అనుక్షణం నీతో నా జీవితం‖ 2x నీవే నా ‖
Verse
నిర్జీవమైన ఈ లోయయందు
జీవాధిపతివై వెలసినావు
హీనశరీరం మహిమ శరీరముగ
నీ వాక్కుతో మహాసైన్యముగ మార్చినావు‖ 2x ‖
హల్లేలూయా హల్లేలూయా నీవే రారాజువు
హోసన్నా హోసన్నా నీవే మహరాజువు‖ 2x నీవే నా ‖

Related Tags

PraiseWorshipDevotional