Chorus
నీవే నా సంతోషగానము
రక్షణశృంగము మహాశైలము‖ 2x ‖
బలశూరుడా యేసయ్యా నా తోడై
ఉన్నత స్ధలములపై నడిపించుచున్నావు‖ 2x ‖
నీవే నా సంతోషగానము‖ నీవే నా సంతోషగానము ‖
Verse
త్యాగము ఎరుగని స్నేహమందు
క్షేమము కరువై యుండగా
నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి‖ 2x ‖
నీ ప్రేమతో నన్నాకర్షించినావు
నిరంతరం నిలుచును నాపై నీ కనికరం
శోధనలైనా బాధలైననూ‖ 2x ‖
ఎదురింతు నీ ప్రేమతో
నీవే నా సంతోషగానము‖ నీవే నా సంతోషగానము ‖
Verse
వేదన కలిగిన దేశమందు
వేకువ వెలుగై నిలిచినావు
విడువక తోడై అభివృద్ధిపరచి‖ 2x ‖
ఐగుప్తులో సింహాసనమిచ్చినావు
మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనం
అనుదినం అనుక్షణం నీతో నా జీవితం‖ 2x ‖
నీవే నా సంతోషగానము‖ నీవే నా సంతోషగానము ‖
Verse
నిర్జీవమైన ఈ లోయయందు
జీవాధిపతివై వెలసినావు
హీనశరీరం మహిమ శరీరముగ‖ 2x ‖
నీ వాక్కుతో మహాసైన్యముగ మార్చినావు
హల్లేలూయా హల్లేలూయా నీవే రారాజువు
హోసన్నా హోసన్నా నీవే మహరాజువు‖ 2x ‖
నీవే నా సంతోషగానము‖ నీవే నా సంతోషగానము ‖