Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Neeve Naa Snehamu

నీవే నా స్నేహము

Neeve Naa Snehamu

Lyricist: Sarah Kantimahanti
Verse
నీవే నా స్నేహము – నీవే నా సర్వస్వము
నీవే ఆధారము – నీవే నా ఆనందము
నీ ప్రేమ నాలో పదిలము
నీలోనే సాక్ష్యమే సంతోషము‖ 2x ‖
సర్వోన్నతుడా నీకే మహిమ
పరమ తండ్రి నీకే ఘనత‖ 2x నీవే ‖
Verse
నా జీవితాంతం నిన్నే పొగడెదను
నా ప్రతి ఆశ నిన్ను మహిమ పరచుటయే‖ 2x ‖
నా దేవుని మందిరములో నివసించెదను
నా స్తుతి నైవేద్యం నీకే అర్పించెదను‖ 2x సర్వోన్నతుడా ‖
Verse
నా బలహీన స్థితిలో గతివి నీవైతివే
నా కన్నీరు నాట్యముగా మార్చినది నీవే‖ 2x ‖
కృంగిన నా హృదయమును లేవనెత్తితివి
అసాధ్యమైనది నీకు ఏదియు లేదయా‖ 2x సర్వోన్నతుడా ‖

Related Tags

PraiseWorshipDevotional