Verse
నీవే నాకు తండ్రివని నీవే నా దేవుడని
నిన్ను గూర్చి పాడెదను నిరంతరము దేవా
నన్నిలా నన్నుగ కోరిన ప్రేమ
ఎన్నడు మారదు మరువని ప్రేమ
Verse
కన్న తల్లి మోసినట్లు – సిలువలో మోసావయ్య
ప్రాణం పెట్టి కన్నావయ్య – నీ త్యాగం నా జీవం
నన్నింతగా ప్రేమించిన ఏ ప్రేమ నేనెరుగను
నను నేనైన ఏనాడిలా ప్రేమించలేదేసయ్యా
లోకమంత ఏకమైనా – నిన్ను నన్ను వేరుచేయునా
నీవు లేక నే లేనయ్య – నీవే నా ప్రాణం
నాన్నా నీవె నా చేయిపట్టి నన్ను నడిపించుము
కనురెప్పలా కలకాలము నీ కౌగిటే దాయుము