Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Neeve Nannu Korukunnaavu Neeve Nannu Cherukunnaavu

నీవే నన్ను కోరుకున్నావు నీవే నన్ను చేరుకున్నావు

Neeve Nannu Korukunnaavu Neeve Nannu Cherukunnaavu

Verse
నీవే నన్ను కోరుకున్నావు నీవే నన్ను చేరుకున్నావు
నీవే నన్ను విడిపించావు నీవే నన్ను విడువనన్నావు
నీ ప్రేమొక వింతయ్యా ఊహకందదు యేసయ్యా
ఎంత ప్రేమ యేసయ్యా వింత ప్రేమ నీదయ్యా
Verse
నీ అరచేతిలో నన్ను చెక్కుకున్నావు
నీ కృపలో నన్ను కనికరించావు
నీ రాజ్యములో నను దాచి వుంచావు
నీ స్వాస్థ్యముగా నన్ను మార్చి వేసావు
Verse
నీ వాక్యముతో నన్ను శుద్ధి చేశావు
నీ రక్తముతో నన్ను కడిగి వేశావు
నీ వాగ్దానముతో నన్ను స్థిరపరచావు
నీ ఆత్మతో నన్ను నింపి వేసావు

Related Tags

GraceSalvationLove