Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Neeve Neeve Kaavaali Prabhuvuku

నీవే నీవే కావాలి ప్రభువుకు

Neeve Neeve Kaavaali Prabhuvuku

Verse
నీవే నీవే కావాలి ప్రభువుకు
నేడే నేడే చేరాలి ప్రభువును‖ 2x ‖
ఈ కాలం కృప కాలం తరిగిపోతుంది
నీ మరణం లోకాంతం తరుముకొస్తుంది‖ 2x నీవే ‖
Verse
నీ సృష్టికర్తను నీవు విడచినా
నీకిష్టమైన రీతి నీవు నడచినా‖ 2x ‖
దోషివయినా ద్రోహివయినా
దేవుని చెంత – చేరిపుడైనా‖ 2x ఈ కాలం ‖
Verse
పాపాలతో నీవు పండిపోయినా
ప్రేమించువారు లేక కృంగిపోయినా‖ 2x ‖
యేసుని చరణం – పాప హరణం
యేసుని స్నేహం – పాపికి మోక్షం‖ 2x ఈ కాలం ‖
Verse
నీటి బుడగలాంటిది నీ జీవితం
గడ్డి పువ్వులాంటిది నీ యవ్వనం‖ 2x ‖
అధికుడవైనా అధముడవైనా
ఆయన ప్రేమ – కోరిపుడైనా‖ 2x ఈ కాలం ‖

Related Tags

GraceRepentanceSalvation