Verse
నీవే నీవే.. నన్ను పిలిచిన స్వరము
నన్ను కలిసిన వరము‖ 2x ‖
స్తుతి గాన సంపద నిన్ను చేరాలని
నా దీన మనస్సు నీవే చూడాలని
ప్రయాసతో ప్రయాణమైతిని‖ నీవే ‖
Verse
నీ తోడు నాకుండగా – ఏ దిగులు నాకుండదు
నీ చెలిమి నాకుండగా – కన్నీరే నాకుండదు‖ 2x ‖
ప్రతి కీడు తప్పించు – పరిశుద్ధ గ్రంథం
నా కొరకే పంపావయ్యా
ఏ చోటనైనా – ఏ పల్లెనైనా
నీ పలుకే బంగారమాయెనయా‖ నీవే ‖
Verse
నోవాహును నడిపిన – నావికుడు నీవేనయ్యా
సంద్రాన్ని చల్లార్చిన – ఆ శక్తి నీదేనయ్యా‖ 2x ‖
దావీదు ప్రార్ధన – ఆ యోబు వేదన
కనిపెట్టి చూసావయ్యా
నా దుఃఖ భారం – నా శాప భారం
నీలోనే కరగాలయ్యా‖ నీవే ‖