Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Neeve Yehova Naa Kaparivi

నీవే యెహోవా నా కాపరివి

Neeve Yehova Naa Kaparivi

Verse
నీవే యెహోవా నా కాపరివి
నాకేమి కొదువ లేదిలలోన
Verse
పచ్చికగలచోట్ల నన్ను జేర్చి
స్వచ్ఛమగు జలము త్రాగనిచ్చి
నా ప్రాణమునకు సేదను దీర్చి
నన్ను నడుపుము నీతిమార్గమున
Verse
గాఢాంధకార లోయలయందు
పడియుండి నేను సంచరించినను
తోడైయుందువు నీ దుడ్డుకర్ర
దండముతో నీ వాదరించెదవు
Verse
శత్రువుల యెదుట నీవు నాకు
నిత్యమగు విందు సిద్ధపరచి
నాతల నూనెతో నంటియున్నావు
నా గిన్నె నిండి పొర్లుచున్నది
Verse
నిశ్చయముగా కృపాక్షేమములే
వచ్చు నా వెంట నే బ్రతుకు దినముల్
చిరకాలము యెహోవా మందిరమున
స్థిరముగా నే నివసించెదను

Related Tags

WorshipPsalmShepherd