Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Neevennaallu Rendu Thalampulatho

నీవెన్నాళ్ళు రెండు తలంపులతో

Neevennaallu Rendu Thalampulatho

Lyricist: Songs Of Zion
Verse
నీవెన్నాళ్ళు రెండు తలంపులతో
కుంటి కుంటి నడిచెదవీవు
యెహోవాయే నీ దేవుడా
లేక వేరే దేవతలున్నారా‖ 2x ‖
Verse
మనం తీర్మానించెదమిప్పుడే
మన నోట వంచన లేకుండా‖ 2x ‖
మరుగైన పాపములన్నిటిన్
హృదయమునుండి తొలగించెదం‖ 2x నీవెన్నాళ్ళు ‖
Verse
మారు మనస్సు పొందెదమిప్పుడే
జీవిత మోసములనుండి‖ 2x ‖
పరిశుధ్ధులమై నిర్దోషులుగా
ప్రభు దినమందు కనబడెదం‖ 2x నీవెన్నాళ్ళు ‖
Verse
నేను నా ఇంటివారలము
యెహోవానే సేవించెదము‖ 2x ‖
నీవెవరిని సేవించెదవో
ఈ దినమే తీర్మానించుకో‖ 2x నీవెన్నాళ్ళు ‖

Related Tags

CommitmentRepentanceDecision