Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Neeveyani Nammika

నీవేయని నమ్మిక

Neeveyani Nammika

Lyricist: Mungamuri Devadasu
Verse
నీవేయని నమ్మిక
యేసు నాకు.. నీవేయని నమ్మిక
నీవే మార్గంబు – నీవే సత్యంబు
నీవే జీవంబు – నీవే సర్వంబు‖ నీవే ‖
Verse
పెడదారిని బోవగ
నా మీదికి.. ఇడుమలెన్నియో రాగ
అడవిలో బడి నేను – ఆడలుచు నుండగ
తడవకుండ దొరుకు – ధన్యమౌ మార్గంబు‖ నీవే ‖
Verse
కారు మేఘము పట్టగ
నా మనస్సులో.. కటిక చీకటి పుట్టగ
ఘోరాపదలు చేరి – దారియని భ్రమపడగ
తేరి చూడగల్గు – తేజోమయ మార్గంబు‖ నీవే ‖
Verse
లేనిపోని మార్గంబు
లెన్నోయుండ.. జ్ఞానోపదేశంబు
మానుగ జేయుచు – వానిని ఖండించి
నేనే మార్గంబన్న – నిజమైన మార్గంబు‖ నీవే ‖
Verse
నరలోకమునుండి
పరలోకంబు.. వరకు నిచ్చెనగా నుండి
నరులకు ముందుగా – నడుచుచు ముక్తికి
సరిగా కొనిపోవు సు-స్థిరమైన మార్గంబు‖ నీవే ‖

Related Tags

WorshipFaithJesus