Verse
నశించిపోయే ఆత్మలు ఎన్నో
నరకపు పొలిమేరను చెర
నన్ను పంపుము నన్ను నడిపించుము
నీ ప్రేమ సువార్త చాటను
నీ వాక్కుతో నీ శక్తితో
నీ ఆత్మతో నీ ప్రేమతో
(నను) నిత్యము నడిపించుమా‖ 2x ‖
Chorus
నీవు చేసిన త్యాగాన్ని
చాటి చెప్పే భాగ్యాన్ని
నాకు ఇమ్ము నా దేవా
వాడుకొనుము నా ప్రభువా‖ 2x నీవు ‖
Verse
నా జీవితాంతం – మరణ పర్యంతం
నీతోనే నేనుందునయ్యా‖ 2x ‖
కరుణ చూచి నీ మహిమ గాంచితి
నిత్యం నిను సేవింతును
నీ సన్నిధిలో ఆ దూతలతో
నీ రాజ్యములో పరిశుద్ధులతో‖ 2x ‖
(నిను) నిత్యము కీర్తింతును‖ 2x నీవు ‖