Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Neevu Chesina Thyaganni Chaaticheppe Bhagyanni

నీవు చేసిన త్యాగాన్ని చాటిచెప్పే భాగ్యాన్ని

Neevu Chesina Thyaganni Chaaticheppe Bhagyanni

Verse
నీవు చేసిన త్యాగాన్ని చాటిచెప్పే భాగ్యాన్ని
నాకు ఇమ్ము నా దేవా వాడుకొనుము నా ప్రభువా‖ 2x ‖
Verse
నశించిపోయే ఆత్మలు ఎన్నో నరకపు పొలిమేరను చేర
నన్ను పంపుము నన్ను నడిపించుము నీప్రేమ సువార్త చాటను
నీ వాక్కుతో నీ శక్తితో నీ ఆత్మతో నీ ప్రేమతో
నిత్యము నడిపించుమా నను నిత్యము నడిపించుమా…
Verse
నా జీవితాంతం మరణ పర్యంతం నీతోనే నేనుందునయ్యా
నీ కరుణ చూచి నీ మహిమ గాంచితి నిత్యం నిను సేవింతును
నీ సన్నిధిలో ఆ దూతలతో నీ రాజ్యములో పరిశుద్ధులతో
నిత్యము కీర్తింతును నిను నిత్యము కీర్తింతును.

Related Tags

GospelSacrificeEvangelism