Verse
నీవు చేసిన ఉపకారములకు
నేనేమి చెల్లింతును‖ 2x ‖
ఏడాది దూడెలనా… వేలాది పోట్టేల్లనా‖ 2x నీవు చేసిన ‖
Verse
వేలాది నదులంత విస్తార తైలము
నీకిచ్చినా చాలునా‖ 2x ‖
గర్భ ఫలమైన నా జేష్ట్య పుత్రుని
నీకిచ్చినా చాలునా‖ 2x ఏడాది ‖
Verse
మరణపాత్రుడనైయున్న నాకై
మరణించితివ సిలువలో‖ 2x ‖
కరుణ చూపి నీ జీవ మార్గాన
నడిపించుమో యేసయ్యా‖ 2x ఏడాది ‖
Verse
విరిగి నలిగిన బలి యాగముగను
నా హృదయ మర్పింతును‖ 2x ‖
రక్షణ పాత్రను చేబూని నిత్యము
నిను వెంబడించెదను‖ 2x ఏడాది ‖
Verse
ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు
నీకేమి చెల్లింతును‖ 2x ‖
కపట నటనాలు లేనట్టి హృదయాన్ని
అర్పించినా చాలునా‖ 2x ఏడాది ‖