Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Neevu Chesina Upakaaramulaku Nenemi Chellinthunu

నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును

Neevu Chesina Upakaaramulaku Nenemi Chellinthunu

Verse
నీవు చేసిన ఉపకారములకు - నేనేమి చెల్లింతును‖ 2x ‖
ఏడాది దూడలనా - వేలాది పొట్టేళ్ళనా‖ 2x ‖
Verse
వేలాది నదులంత విస్తార తైలము - నీకిచ్చినా చాలునా‖ 2x ‖
గర్భఫలమైన నా జ్యేష్ఠపుత్రుని - నీకిచ్చినా చాలునా‖ 2x ‖
Verse
మరణ పాత్రుడనైయున్న నాకై - మరణించితివి సిల్వలో‖ 2x ‖
కరుణ చూపి నీ దివ్య మార్గాన - నడిపించితివి యేసయ్యా‖ 2x ‖
Verse
విరిగి నలిగిన బలియాగముగను - నా హృదయమర్పింతునూ‖ 2x ‖
రక్షణ పాత్రను చేబూని నిత్యం - నిను వెంబడించేదను‖ 2x ‖
Verse
ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందున - నేనేమి చెల్లింతునూ‖ 2x ‖
కపట మనస్సు లేనట్టి హృదయాన్ని - అర్పింతునోయేసయ్యా‖ 2x ‖

Related Tags

WorshipThanksgivingSalvation